మొత్తానికి పవన్‌కళ్యాణ్ నిర్మాతగా తన పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్‌పై రామ్‌చరణ్ హీరోగా ‘సర్దార్’ అనే చిత్రం నిర్మించనున్నాడు అనే వార్త మెగాభిమానులకు ఆనందాన్ని పంచింది. అయితే ఇప్పటికే పవన్ ఆ బేనర్‌లో ‘సత్యాగ్రహి, కోబలి, టైగర్ సీతారాముడు’ వంటి టైటిల్స్‌ను రిజిష్టర్ చేయించి ఉన్నాడు. మరి ‘సర్దార్’ తర్వాత ఆయన మిగిలిన టైటిల్స్‌పై వరుసగా సినిమాలు నిర్మిస్తాడా? లేక తాను నటించే చిత్రాల కోసమే వాటిని దాచుకుంటాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొదట్లో ఈ ‘సర్దార్’ చిత్రం దాసరి, పవన్‌ల కాంబినేషన్‌లో రానున్న చిత్రం కోసమే అని అందరూ భావించారు. కానీ అది నిజం కాదని తేలిపోయింది. మరి పవన్ నిర్మాతగా నిర్మించే చిత్రాలు ఏవి? ఆయన నటించే చిత్రాలు ఏవి? అనే విషయంలో ఇంకా కన్‌ఫ్యూజన్‌కు తెరపడలేదనే చెప్పాలి. ఏదిఏమైనా ఈ విషయాలపై పవనే క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.