కోమటిరెడ్డి బ్రదర్స్‌కు, టీపీసీసీ కొత్త చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మధ్య దూరం పెరుగుతోంది. పనితీరు బాగాలేదని పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ చీఫ్ పదవినుంచి తొలగించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆ బాధ్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ సమాచారం తెలుసుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనకు ఆ పదవి దక్కకుండా చేసేందుకు తీవ్రంగా శ్రమించినట్లు వినికిడి. అయినా అధిష్టానం తమ మాట వినకపోవడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నేరుగా అధిష్టానంపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకుల అభిప్రాయం తీసుకోకుండా టీపీసీసీ చీఫ్‌ను అధిష్టానం ఎలా నియమిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని, మెజార్టీ అభిప్రాయానికి తగిన విధంగా అధిష్టానం నడుచుకోవాలని మండిపడ్డాడు. ఇక వైరి వర్గానికి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వీరికంటే పెద్ద పదవి లభించడం కోమటిబ్రదర్స్‌ను చిక్కుల్లోకి నెట్టేదే. దీన్నిబట్టి వీరు కాంగ్రెస్‌లో మరెంత కాలం ఉంటారోనన్న అనుమానాలు కూడా రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.