Advertisementt

పవన్‌కు జాగ్రత్తలు చెబుతున్న పొలిటికల్‌ యాక్టర్‌..!!

Tue 03rd Mar 2015 06:38 AM
anm viveka nandareddy,pawan kalyan,chandrababu naidu,budget  పవన్‌కు జాగ్రత్తలు చెబుతున్న పొలిటికల్‌ యాక్టర్‌..!!
పవన్‌కు జాగ్రత్తలు చెబుతున్న పొలిటికల్‌ యాక్టర్‌..!!
Advertisement
Ads by CJ

ఆనం వివేకానందరెడ్డి ప్రస్తుతం పొలిటికల్‌ యాక్టర్‌గా మారిపోయాడు. రాజకీయాలనుంచి సినీ రంగంలో ప్రవేశించి సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ఇక ఆయన ఏం చేసినా ఇంతకుముందు ప్రత్యేకంగా ఉండేది. ఇక ఇప్పుడు ఆయన పవన్‌కల్యాన్‌కు సూచనలు చెప్పడం ప్రారంభించారు. చంద్రబాబు గురించి పవన్‌కు జాగ్రత్తలు చెబుతూ.. బాబు వాడేసుకొని వదిలేసే రకమని, గతంలో బాబుమోహన్‌, జయప్రదలను కూడా అలాగే చేశాడని ఆనం వివేకానందరెడ్డి మీడియా సమక్షంలో పవన్‌కు జాగ్రత్తలు చెప్పారు. చంద్రబాబు ట్రాప్‌లో పవన్‌కల్యాన్‌ పడవద్దని, మోడీ వద్దకు నేరుగా వెళ్లి మాట్లాడి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడితే చరిత్రలో నిలిచిపోతారంటూ వ్యాఖ్యానించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వైఎస్‌ఆర్‌ బతికి ఉన్నప్పుడు ఆనం బ్రదర్స్‌ ఆయనకు చాలా సన్నిహితంగా మెలిగారు. వైఎస్‌ మరణించిన తర్వాత ఆయనతోపాటు ఆయన కుమారుడు జగన్‌ను కూడా ఆనం వివేకానందరెడ్డి తీవ్రంగా విమర్శించారు. మరి ఈ లెక్కన ఆనం కూడా వైఎస్‌ను వాడుకొని వదిలేసినట్టా అనే ప్రశ్న తలెత్తుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ