Advertisement

కేసీఆర్‌ చెప్పిందొకటి.. జరిగింది మరోటి..!!

Tue 03rd Mar 2015 06:23 AM
kcr,scst sub plan,budget,telangana  కేసీఆర్‌ చెప్పిందొకటి.. జరిగింది మరోటి..!!
కేసీఆర్‌ చెప్పిందొకటి.. జరిగింది మరోటి..!!
Advertisement

మాటలకు చేతలకు పొంతన ఉండదనేది కేసీఆర్‌ మీద ఉన్న ప్రధాన అపవాదు. ఆయన చెప్పేవి చాలా ఉంటాయని, చేసేవి మాత్రం చాలా తక్కువని విపక్షాలు విమర్శిస్తుంటాయి. ఇక ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కోసం కేసీఆర్‌ చెప్పిన మాటలను చూస్తే ఇది నిజమనిపించక మానదు. ఏడాదికి పదివేల కోట్ల చొప్పున ఐదేళ్లలో యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతామని కేసీఆర్‌ ప్రకటించారు. ఇక మొదటి బడ్జెట్‌ విషయానికొస్తే ఎస్టీల అభివృద్ధికి రూ. 7945 కోట్లు, ఎస్సీలకు రూ. 4404 కోట్లు వివిధ పథకాల రూపంలో ప్రకటించారు. ఇక వాస్తవానికి వస్తే గడిచిన ఏడాది కాలంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎస్సీల కోసం రూ. 1528 కోట్లు, ఎస్టీల కోసం రూ. 499 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది కేసీఆర్‌ చెప్పినదానిలో కేవలం 20శాతం మటుకే. ఈ లెక్కన కేసీఆర్‌ చెప్పినదానిలో ప్రభుత్వం కేవలం 20శాతం కూడా ఖర్చుపెట్టలేదు. ఇక కేసీఆర్‌ మిగిలిన హామీలు కూడా ఇదే రూపంలో ఉంటే భవిష్యత్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కష్టాలు తప్పవేమోనన్న వాదనలు వినబడుతున్నాయి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement