మొదటి చిత్రంతోనే దర్శకులుగా ఘనవిజయాలు సొంతం చేసుకునే దర్శకులకు తిరుగుండదు అని అందరూ అనుకుంటారు. హిట్ అనేదే సినిమా ఫీల్డ్ లో అందరికంటే, అన్నింటికంటే ముఖ్యమైనది అని అందరూ భావిస్తుంటారు. కానీ మొదటి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన దర్శకులకు కూడా రెండో ఛాన్స్ రావడం లేదంటే అది వాళ్ళ దురదృష్టం అనుకోవాల్సిందే. అలంటి వారిలో 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' దర్శకుడు మేర్లపాక గాంధీ, 'ఉయ్యాలా జంపాల' దర్శకుడు విరించి వర్మ, 'ఊహలు గుసగుసలాడే' ఫేమ్ అవసరాల శ్రీనివాస్ వంటి వారిని ముఖ్యంగా చెప్పుకోవాలి. మొదటి సినిమాతో అద్భుతమైన హిట్ ఇచ్చినప్పటికీ వీరికి ఇప్పటి వరకు రెండో అవకాశం రాకపోవడం ఆశ్చర్యకరం మరియు బాధాకరం. తమకు సినిమా హిట్ అయిన వెంటనే వచ్చిన క్రేజ్ ను వీరు వెంటనే క్యాష్ చేసుకోలేకపోవడమే వీరి దురదృష్టానికి కారణంగా అందరూ విశ్లేషిస్తున్నారు. మేర్లపాక గాంధీకి శర్వానంద్ హీరోగా ఓ ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి మిగిలిన ఇద్దరి పరిస్థితి ఏమిటో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.