Advertisementt

కన్నడంలో ‘భమ్ బోలేనాథ్’!

Tue 03rd Mar 2015 03:47 AM
bham bolenath in kannada,navadeep,naveen chandra,pooja jhaveri,bham bolenath,kannada  కన్నడంలో ‘భమ్ బోలేనాథ్’!
కన్నడంలో ‘భమ్ బోలేనాథ్’!
Advertisement
Ads by CJ

నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘భమ్ బోలేనాథ్’. పూజ కథానాయిక. ఆర్.సి.సి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శిరువూరి రాజేష్‌వర్మ నిర్మించిన ఈ చిత్రం ద్వారా కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం వైవిధ్యమైన చిత్రంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ చిత్రాన్ని కన్నడంలో రీమేక్ హక్కులను దండుపాళ్యం, శివమ్ చిత్రాల దర్శక నిర్మాత శ్రీనివాసరాజు దక్కించుకున్నారు. ప్రముఖ తారాగణంతో త్వరలోనే ఆయన కన్నడంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ