మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లుఅర్జున్ లు ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈసారి రామ్ చరణ్ సినిమాలు రెండు విడుదలయ్యేలా కనిపించడం లేదు. కానీ బన్నీ మాత్రం ఏకంగా మూడు చిత్రాలతో తన అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. బన్నీ గోనగన్నారెడ్డి గా నటించిన 'రుద్రమదేవి' తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తోన్న 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం కూడా కొద్దిపాటి గ్యాప్ తో ఈ వేసవి సీజన్ లో విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక 'సన్నాఫ్ సత్యమూర్తి' షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించే చిత్రం మొదలు కానుంది. ఈ చిత్రాన్ని స్వయంగా గీతాఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా ఎలాగైనా ఇదే ఏడాది చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి ఇదే కనుక జరిగితే ఈ ఏడాది బన్నీ తన అభిమానులకు ట్రిపుల్ ట్ర్రీట్ ఇస్తున్నట్లే లెక్క.