Advertisementt

ముస్తాబవుతోన్న 'జిల్'....!

Mon 02nd Mar 2015 10:13 AM
jil movie,gopichand,loukyam,radha krishnakumar  ముస్తాబవుతోన్న 'జిల్'....!
ముస్తాబవుతోన్న 'జిల్'....!
Advertisement
Ads by CJ

గత ఏడాది దసరాకు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా వచ్చి అన్నింటిని  అధిగమించి పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం 'లౌక్యం'. ఈ చిత్రం ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఉన్న గోపీచంద్ మరోసారి పెద్ద పెద్ద చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నప్పటికీ  తన 'జిల్' సినిమాతో వేసవి బరిలో దిగనున్నాడు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో గోపీచంద్, రాశిఖన్నా జంటగా రూపొందుతున్న ఈ 'జిల్' చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే  'మిర్చి, రన్ రాజ రన్' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ సంస్థ 'జిల్'తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కృతనిశ్చయంతో ఉంది. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇదే నెలలో ఆడియోను విడుదల చేసి మార్చి 27న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ