మొత్తానికి వరుసగా రెండు డిజాస్టర్స్ చూసిన మహేష్ బాబుకు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంపై మహేష్ కే కాదు.. ఆయన అభిమానులకు కూడా కీలకంగా మారింది. చివరకు వారు ఉండబట్టలేక ఓ ఫేక్ పోస్టర్ ని డిజైన్ చేసి ఇంటర్ నెట్ లో పెట్టడం వారి ఉత్కంట ఏమిటో అర్ధమయ్యేలా చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తికాకముందే బిజినెస్ ఓ రేంజ్ లో సాగుతున్నట్లు సమాచారం. సాధారణంగా మహేష్ చిత్రాలు ఓవర్ సీస్ లో మంచి కలెక్షన్లు వసూలు చేస్తాయి. అదే ఉద్దేశ్యంతో ఓవర్ సీస్ లో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన సౌత్ ఇండియన్ క్లాసిక్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఓవర్ సీస్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. ఈ చిత్రం మేలో విడుదలకు సిద్దమవుతుంది. పొల్లాచ్చిలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ కి చెందిన స్టంట్ మాస్టర్ అణల్ అరసు యాక్షన్ కంపోజర్ గా పనిచేస్తున్నాడు. ఇక ఈ చిత్రం తదుపరి షెడ్యుల్ కోసం త్వరలో ఫ్రాన్స్ కు వెళ్లనుంది.