Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి

Sun 01st Mar 2015 02:23 AM
praveen pudi,editor praveen pudi,praveen pudi birthday march 1st,praveen pudi interview  సినీజోష్‌ ఇంటర్వ్యూ: ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి
సినీజోష్‌ ఇంటర్వ్యూ: ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి
Advertisement

15 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి వచ్చి ఎంతో మంది ఎడిటర్స్‌ దగ్గర వర్క్‌ నేర్చుకొని ‘ఆకాశ రామన్న’ చిత్రంతో ఎడిటర్‌గా పరిచయమై ఇప్పుడు బిజీ ఎడిటర్‌గా భారీ చిత్రాలకు ఎడిటింగ్‌ చేస్తున్న మోస్ట్‌ టాలెంటెడ్‌ ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి. మార్చి 1 ప్రవీణ్‌పూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్‌ ఎలా స్టార్ట్‌ అయింది, ఏ సినిమా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది, ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలు, ఫ్యూచర్‌లో చెయ్యబోతున్న సినిమాల గురించి ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడితో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

మీ కెరీర్‌ ఎలా స్టార్ట్‌ అయింది?

మాది నల్గొండ జిల్లా. నిజం చెప్పాలంటే నేను ఇంటర్మీడియట్‌ డిస్కంటిన్యూ. అప్పుడు కోటగిరి వెంకటేశ్వరరావుగారి దగ్గర అప్రెంటిస్‌గా జాయిన్‌ అయి వర్క్‌ నేర్చుకున్నాను. రాజకుమారుడు, చూడాలని వుంది, సమరసింహారెడ్డి వంటి సినిమాలకు ఆయన దగ్గర వర్క్‌ చేశాను. అప్పట్లో ఫిల్మ్‌ ఎడిటింగ్‌ మాత్రమే వుండేది. దాని తర్వాత డిజిటలైజేషన్‌ వచ్చిన తర్వాత యావిడ్‌ సాఫ్ట్‌వేర్‌ నేర్చుకున్నాను. మార్తాండ్‌ కె.వెంకటేష్‌గారి దగ్గర మూడు సంవత్సరాలు పనిచేశాను. 2002లో పవన్‌కళ్యాణ్‌గారి దగ్గర వర్క్‌ చేసే అవకాశం వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌లో 6 సంవత్సరాలు ఆయనకు పర్సనల్‌ యావిడ్‌ ఇంజనీర్‌గా వర్క్‌ చేశాను. ఆయన దగ్గర జాని, గుడుంబా శంకర్‌, బాలు, అన్నవరం చిత్రాలకు అసోసియేట్‌ ఎడిటర్‌గా వర్క్‌ చేశాను. ఆ తర్వాత శ్రీకరప్రసాద్‌గారి దగ్గర కూడా వర్క్‌ చేశాను. ఇండివిడ్యుయల్‌ ఎడిటర్‌గా ‘ఆకాశరామన్న’ చిత్రంతో అవకాశం వచ్చింది.

‘ఆకాశరామన్న’ తర్వాత మీరు చేసిన సినిమాలు?

రామ్‌గోపాల్‌వర్మగారి అప్పల్రాజు, పిల్ల జమీందార్‌, గాయం2, అయ్యారే వంటి సినిమాలు చేశాను. ఆ తర్వాత చేసిన జులాయి నాకు మంచి బ్రేక్‌ ఇచ్చిన సినిమా. ఇప్పుడు నేను బిజీగా వుండి ఎక్కువ సినిమాలు చేస్తున్నానంటే దానికి కారణం త్రివిక్రమ్‌గారు.

స్క్రీన్‌ప్లేకి, ఎడిటింగ్‌కి చాలా దగ్గరి సంబంధం వుంటుంది. దాన్ని మీరు ఎలా మేనేజ్‌ చేస్తారు?

స్క్రీన్‌ప్లేలో చాలా రకాలు వుంటాయి. జనరల్‌గా ఒక కథ అనుకున్నప్పుడు దాన్ని  సీన్‌ బై సీన్‌ డిజైన్‌ చేసుకొని వుంటారు. అయితే ఒక ఎడిటర్‌గా షాట్‌ బై షాట్‌ కూడా స్క్రీన్‌ప్లే అనే చెప్తాను. కాకపోతే సబ్‌ ప్లాట్‌ఫామ్‌గా చెప్పొచ్చు. దానికి తగ్గట్టుగానే ఎడిటింగ్‌ కూడా వుంటుంది. మూడు జనరేషన్స్‌కి సంబంధించి ఒక డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో ఈమధ్యకాలంలో వచ్చిన ‘మనం’ నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. అలాగే ‘అత్తారింటికి దారేది’ కూడా మంచి పేరు తెచ్చింది. అయితే త్రివిక్రమ్‌గారి స్క్రీన్‌ప్లే చాలా ప్లాన్డ్‌గా వుంటుంది. దానికి అనుగుణంగానే నేను వర్క్‌ చేశాను. 

ఫిల్మ్‌ ఎడిటింగ్‌, డిజిటల్‌ ఎడిటింగ్‌.. ఈ రెండిరటిలో ఏది కష్టం?

డెఫినెట్‌గా ఫిల్మ్‌ ఎడిటింగ్‌ అనేది చాలా కష్టం. డిజిటల్‌లో ఒక షాట్‌ రాంగ్‌గా ఎడిట్‌ చేసినా ఒక్క బటన్‌తో దాన్ని సరిచేయవచ్చు. కానీ, మాన్యుయల్‌లో ఫిల్మ్‌ని కట్‌ చేసి, జాయింట్‌ చేసి చెయ్యాల్సి వచ్చేది. షాట్‌ బై షాట్‌ చాలా పర్‌ఫెక్ట్‌ చెయ్యాలి. అలా చెయ్యాలంటే ఎడిటర్‌కి మోర్‌ విజన్‌ వుండాలి. 

‘జులాయి’ సినిమా చేసే ఛాన్స్‌ ఎలా వచ్చింది?

‘జల్సా’కి శ్రీకర్‌ప్రసాద్‌గారు ఎడిటర్‌. ఆ సినిమాకి నేను అసోసియేట్‌గా చేశాను. అలా త్రివిక్రమ్‌గారితో పరిచయం. ఆ తర్వాత ‘ఖలేజా’కి కూడా అసోసియేట్‌గా వర్క్‌ చేశాను. ఇండిపెండెంట్‌గా ఎడిటర్‌ అయిన తర్వాత త్రివిక్రమ్‌గారు ‘జులాయి’ సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చారు. ఎన్ని సినిమాలకు వర్క్‌ చేసినా సక్సెస్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌. స్టార్‌ కాస్ట్‌ని బట్టి, టెక్నీషియన్స్‌ని బట్టే ఆ సినిమాకి వాల్యూ అనేది వుంటుంది. మనం చేసిన ప్రొడక్ట్‌ అందరికీ రీచ్‌ అయ్యేలా వుంటేనే టెక్నీషియన్స్‌ వర్క్‌ అనేది అందరికీ తెలుస్తుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ నాకు మంచి పేరు తెచ్చినవే.

ఒక సినిమా సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌లో ఎడిటర్‌ పార్టిసిపేషన్‌ని కూడా చెప్పుకుంటారు. దానికి మీరేమంటారు?

అది రెండు రకాలుగా వుంటుంది. ఎందుకంటే ఏ సినిమాకైనా టైమింగ్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌. కొన్ని షాట్స్‌లో ఒక టైమ్‌ని మించి హోల్డ్‌ చెయ్యలేము. అలాంటివన్నీ ప్రాపర్‌గా చేసినపుడు బాగా వస్తుంది. ప్రతి సినిమా డైరెక్టర్‌ అనుకున్న దాని ప్రకారమే, అతని విజన్‌కి తగ్గట్టుగానే ఎడిటింగ్‌ అనేది కూడా వుంటుంది. డైరెక్టర్‌ తన విజన్‌ ప్రకారం తీసిన షాట్స్‌ని పేపర్‌ మీద ఎలాగైతే రాసుకుంటారో అలాగే ఎడిటింగ్‌లో కూడా మేం రాసుకుంటాం. ఏదైనా డైరెక్టర్‌ విజన్‌ ప్రకారమే ఎడిట్‌ చేస్తాం. అయితే మనం చేసిన ఎడిటింగ్‌ ఆయన అనుకున్న టైమింగ్‌కి సెట్‌ అయిందా లేదా అనేది చూస్తారు. ఒకవేళ ఏదైనా షాట్‌ టైమ్‌ మిస్‌ అయితే దాన్ని డైరెక్టర్‌ కరెక్ట్‌ చేస్తారు. 

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమా, నాగార్జునగారి ‘సోగ్గాడే చిన్ని నాయన’ వర్క్‌ జరుగుతోంది. నితిన్‌గారి ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’ రిలీజ్‌కి రెడీగా వుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రవీణ్‌ పూడికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తోంది ‘సినీజోష్‌’. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement