Advertisementt

బాలయ్యపై ఆశలు పెట్టుకుంటున్న నిర్మాతలు..!

Sat 28th Feb 2015 12:43 PM
balayya 100th movie,ntr arts,kalyan ram,varahi banner  బాలయ్యపై ఆశలు పెట్టుకుంటున్న నిర్మాతలు..!
బాలయ్యపై ఆశలు పెట్టుకుంటున్న నిర్మాతలు..!
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించే 100వ చిత్రం ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని, అందుకోసం ఆయన ఓ పవర్ ఫుల్ స్టోరీని తయారుచేసుకున్నట్లు  వార్తలు వస్తున్నాయి. మరోపక్క తన బాబాయ్ బాలకృష్ణ నటించే 100వ చిత్రాన్ని తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ లోనే తీయాలని హీరో కమ్ ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్ ఆశపడుతున్నాడట. ఆ చిత్రం కోసం ఆయన కొద్ది మంది రైటర్స్ చేత స్టోరీ రెడీ చేయించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బేనర్ లో చేస్తానని మాట ఇచ్చాడని నిర్మాత సాయి కొర్రపాటి అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద బాలయ్య తన వందో చిత్రం నిర్మించే అవకాశం ఎవరికి ఇస్తాడో చూడాలి..! మధ్యస్థంగా  బాలయ్య తన వందో చిత్రం ఛాన్స్ ఒకరికి, తన తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే భాద్యతను మరొకరికి అప్పగిస్తాడని అంటున్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ