Advertisementt

'టెంపర్' బాలీవుడ్ రీమేక్ పై కాస్త క్లారిటీ...!

Sat 28th Feb 2015 08:37 AM
temper,hindi remake,sachin joshi,prabhudeva,prakashraj  'టెంపర్' బాలీవుడ్ రీమేక్ పై కాస్త క్లారిటీ...!
'టెంపర్' బాలీవుడ్ రీమేక్ పై కాస్త క్లారిటీ...!
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్ -పూరీ జగన్నాధ్ - బండ్లగణేష్ కాంబినేషన్ లో వచ్చిన 'టెంపర్' చిత్రం ఇటీవల 40 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలీవుడ్ రైట్స్ ను సచిన్ జోషీ తీసుకున్న విషయం విదితమే. బాలీవుడ్ లో ఎన్టీఆర్ పోషించిన పాత్రను రణవీర్ సింగ్ పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సినిమాలో కీలకపాత్రను పోషించిన కానిస్టేబుల్ నారాయణమూర్తి పాత్రను బాలీవుడ్ లో పరేష్ రావల్ చేస్తాడని, ప్రకాష్ రాజ్ పాత్రను హిందీలో  కూడా ప్రకాష్ రాజే పోషిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్రముఖ దర్శకుడు ప్రభుదేవా ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి త్వరలోనే బాలీవుడ్ 'టెంపర్'లో హీరోయిన్, దర్శకుడు ఇతర విషయాలు అఫీషియల్ గా వెల్లడికానున్నాయి.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ