కేసీఆర్ కుమారుడు కేటీఆర్ త్వరలోనే టీఆర్‌ఎస్ పార్టీలో అందలమెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కేటీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని కొన్ని రోజులుగా ఉహాగానాలు వినబడుతున్నాయి. అయితే ఒకేసారి కేటీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిగా నియమించే కంటే ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేసి ఆ తర్వాత ప్రెసిడెంట్‌ను చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేటీఆర్ రాష్ట్ర ఐటీశాఖ మంత్రిగా ఉన్నారు. ఇక ఇంత తొందరగా కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం వెనుక కేసీఆర్ ఎత్తుగడ ఏంటనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన అల్లుడు హరీష్‌రావుకు చెక్‌పెట్టి కుమారుడికి పట్టాభిషేకం చేసేందుకే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 26 జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.