నేడు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలే ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, రానున్న బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనాకర్షక బడ్జెట్‌నే ప్రవేశపెడతారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రైల్వే బడ్జెట్‌తో దేశ ప్రజలను కాస్త నిరుత్సాహపరిచిన ఎన్‌డీఏ సర్కారు ఈసారి ఆ తప్పును పునరావృతం చేసే అవకాశాలు తక్కువే. ఇక మరోవైపు హైదరాబాద్‌నుంచి ఢిల్లీకి నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చాలంటూ టీఆర్‌ఎస్ చేసిన విజ్ఞప్తిని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఈ విషయమై వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పేరు మార్చడం పెద్ద పని కాదని, దానికోసం బడ్జెట్ సమయంలోనే ప్రతిపాదన చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. భవిష్యత్తులో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తామని, అలాగే ఆంధ్రప్రదేశ్‌నుంచి కూడా ఢిల్లీకి కొత్త రైలును ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.