వివిధ రకాల గెటప్ లు, పేర్లతో స్క్రీన్ పై నవ్వులు పూయించి యావరేజ్ చిత్రాన్ని కూడా తన నటనతో హిట్ కు మార్చగలిగిన కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఆయన పాత్ర పండితే ఇక బాక్సా ఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమనేది వాస్తవం. 'నాయక్'లో జిలేబీగా, 'రేసుగుర్రం'లో కిల్ బిల్ పాండేగా, 'అల్లుడు శీను'లో డింపుల్ గా, 'లౌక్యం'లో సిప్పిగా.. ఇలా ప్రతి చిత్రంలోనూ తనదైన వెరైటీ చూపించే బ్రహ్మానందం ప్రస్తుతం ఓ చిత్రంలో చేస్తున్న క్యారెక్టర్ ఆ చిత్రానికి హైలైట్ అవుతుంది అంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న 'పండగచేస్కో' చిత్రంలో బ్రహ్మానందం వీకెండ్ వెంకట్రావ్ గా కనిపించి, తనదైన కామెడీతో అదరగొడుతున్నాడని సమాచారం. ఆల్ రెడీ ఇంతకు ముందు రామ్-బ్రహ్మీలు నటించిన 'రెడీ' చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ చిత్రానికి మించి 'పండగ చేస్కో' లోని 'వీకెండ్ వెంకట్రావ్' పాత్ర అలరిస్తుందని యూనిట్ సభ్యులు ధీమాగా ఉన్నారు.