ఇటీవల అనుష్క ప్రధానపాత్రలో రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో పి.వి.పి. సంస్థ నిర్మించనున్న 'సైజ్ జీరో' చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేయనుందని సమాచారం. ఆమె రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనుంది. తమిళ హీరో ఆర్య ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా, శృతి హాసన్ ఓ ఐటంసాంగ్ లో నర్తించనుంది. అయితే ఈ చిత్రానికి ముందు ఆ మధ్య అనుష్క ద్విపాత్రాభినయం చేస్తూ, ఆర్య హీరోగా రూపొంది డిజాస్టర్ గా నిలిచినా 'వర్ణ' చిత్రాన్ని కూడా పివిపి సంస్థే నిర్మించడం గమనార్హం. ఒక్క దర్శకుడు తప్ప దాదాపు అదే క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న 'సైజ్ జీరో' చిత్రమైన పివిపి సంస్థకు మంచి హిట్ ను ఇస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...!