Advertisementt

మంచు లక్ష్మీ భలే స్కెచ్ వేసింది....!

Fri 27th Feb 2015 06:23 AM
manchu lakshmi,mohanbabu,special song,rana guest role  మంచు లక్ష్మీ భలే స్కెచ్ వేసింది....!
మంచు లక్ష్మీ భలే స్కెచ్ వేసింది....!
Advertisement
Ads by CJ

తనకున్న పరిచయాలతో తమ చిత్రాల్లో ఇతర క్రేజీ నటులను ఒప్పించి క్యాష్ చేసుకోవడంలో మోహన్ బాబు బహు మేధావి. 'కృష్ణార్జున, అధిపతి' చిత్రాల్లో ఆయన నాగార్జున చేత స్పెషల్ రోల్స్ చేశాడు. ఇప్పుడు అవే లక్షణాలను ఆయన కూతురు మంచు లక్ష్మి పుణికిపుచ్చుకుంది.  ఆమె ఆ మధ్య చేసిన 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా' చిత్రంలో ఏకంగా బాలకృష్ణ చేత ఓ పాత్రను చేయించింది.  ఈమె తాజాగా నటిస్తూ నిర్మిస్తున్న 'దొంగాట' చిత్రంలో ఓ పాటలో కనిపించేందుకు నాగార్జున, రవితేజ, రానా, నాని, సుశాంత్, శింబు, తాప్సి వంటి వారిని ఒప్పించింది. ఈ చిత్రానికి ఈ పాటే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని  యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రంలో అడవిశేష్ హీరోగా నటించనుండగా, రానా అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఆమె తమిళంలో కూడా విడుదల చేసే అవకాశం ఉండటంతో రానా, శింబు, తాప్సి వంటి వారిని స్వయంగా సెలక్ట్ చేసుకుందిట. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ