Advertisementt

దాసరి-పవన్ చిత్రం విషయంలో మరో సంచలన వార్త...!

Fri 27th Feb 2015 06:07 AM
mega family fans,dasari,pawankalyan,mohanbabu  దాసరి-పవన్ చిత్రం విషయంలో మరో సంచలన వార్త...!
దాసరి-పవన్ చిత్రం విషయంలో మరో సంచలన వార్త...!
Advertisement
Ads by CJ

దాసరికి మెగా ఫ్యామిలీకి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని మెగాభిమనులకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో అన్నయ్య చిరంజీవి ఇబ్బంది పడతాడని తలిసి కూడా పవన్ దాసరి నిర్మాతగా ఓ చిత్రం చేయనున్నాడనే  విషయాన్నీ ఇప్పటికీ మెగాభిమానులు  జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా పవన్ చేసిన పని ఎంతో కొంత మేలని, అదే దాసరి దర్శకత్వంలో పవన్ చేస్తానని  మాట ఇచ్చివుంటే అది 'పరమవీరచక్ర2' గా మారి ఉండేదని మెగాభిమానులు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని దాసరి స్వయంగా కన్ ఫర్మ్ చేయకుండా ఉంటే ఈ వార్త నిజమని ఎవ్వరు నమ్మేవారుకాదేమో..! ఈ చిత్రం విషయంలో ఇప్పుడు మరో సంచలన వార్త ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. దాసరి-పవన్ ల చిత్రంలో మోహన్  బాబును విలన్ గా నటించమని దాసరి కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలే నాకు తిక్కుంది..దానికో లేక్కుంది అనే పవన్ దానికి కూడా సై అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, ఇక నుండి మెగాభిమానులు  దేనికైనా, ఏ షాకింగ్ న్యూస్ కైనా తట్టుకునే శక్తిని సంపాదించుకోవాలని కొందరు సెటైర్లు వేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ