Advertisementt

మరోసారి నెగటివ్‌ షేడ్స్‌లో తారక్‌...!

Fri 27th Feb 2015 01:14 AM
ntr,temper,negative shade character,sukumar  మరోసారి నెగటివ్‌ షేడ్స్‌లో తారక్‌...!
మరోసారి నెగటివ్‌ షేడ్స్‌లో తారక్‌...!
Advertisement
Ads by CJ

‘టెంపర్‌’లో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న దయాగాడి పాత్రకు జీవం పోసిన ఎన్టీఆర్‌ ఈ చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా నటునిగా కూడా తన  నటనకు అత్యుత్తమ ప్రశంసలు పొందుతుండటంతో ఆయన దైర్యంగా మరో అడుగు ముందుకు వేయనున్నాడని సమాచారం. త్వరలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో కూడా ఎన్టీఆర్‌ పూర్తి నెగటివ్‌ షేడ్స్‌ ఉన్నపాత్రను చేయనున్నాడని సమాచారం. ఈ చిత్రం పూర్తి స్క్రిప్ట్‌ రెడీ అవుతోంది. ఇందులో అత్యత్తమ నటనకు ఆస్కారం ఉన్న ఓ డైనమిక్‌ పాత్రను ఎన్టీఆర్‌ చేయనున్నాడట. ఇక సుకుమార్‌ తన హీరోల క్యారెక్టరైజేషన్‌ ఎలా చేస్తాడు? అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన హీరోల క్యారెక్టర్లకు ఎప్పుడూ కాస్త నెగటివ్‌ టచ్‌ ఇస్తూనే ఉంటాడు. ఇక ఎన్టీఆర్‌ సై అనేసరికి కొద్దిగా కాదు..పూర్తిగా నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రకు ఆయన రంగం సిద్దం చేస్తున్నాడు. ఒక విజయం ఇచ్చే ధైర్యం అలాంటిదని ఎన్టీఆర్‌ను చూస్తేనే తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ