జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆస్తుల అటాచ్‌మెంట్ పరంపర కొనసాగుతోంది. తాజాగా జగన్‌కు సంబంధించిన కేసులో మరో రూ.232 కోట్ల విలువైన ఆస్తునలు జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. జగన్ అమ్రాస్తుల కేసులో మనీలాండరింగ్ కింద జననీ ఇన్‌ఫ్రా, ఇండియా సిమెంట్స్ కంపెనీలకు సంబంధించిన చర, స్థిర కలిపి మొత్తం రూ. 232 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఒకేసారి ఇంతపెద్ద మొత్తంలో ఈడీ ఆస్తులను జప్తు చేయడం చాలా అరుదుగా జరుగుతోంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతుండగా.. టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ అక్రమాస్తులు తవ్వినకొద్ది బయటపడుతున్నాయని, త్వరలోనే మళ్లీ ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.