‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో మరలా హిట్ ట్రాక్‌లోకి వచ్చిన దర్శకుడు రవికుమార్‌చౌదరి తన తదుపరి చిత్రాన్ని నితిన్ హీరోగా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన చేయబోయేది నితిన్‌తో కాదు నందమూరి కళ్యాణ్‌రామ్‌తో అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్‌రాజు తన సొంతబేనర్‌లో నిర్మిస్తాడని సమాచారం. ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ప్రస్తుతం కథ ఓకే అయిందని, పూర్తిస్థాయి స్క్రిప్ట్‌వర్క్‌ను పూర్తి చేసే పనిలో దర్శకుడు చౌదరి ఉన్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్‌రామ్ ఇప్పుడు ‘పటాస్’ చిత్రం సాధించిన ఘనవిజయంతో ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని అవుట్‌రేటుకు కొనుకున్న దిల్‌రాజుకు కూడా భారీగానే లాభాలు వచ్చాయి. దీంతో దిల్‌రాజు కళ్యాణ్‌రామ్ తదుపరి చిత్రానికి ముందుకువచ్చాడట. అలాగే రవికుమార్‌చౌదరి తీసిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రానికి సైతం దిల్‌రాజు ఒక నిర్మాతగా ఉండి లాభాలు పొందాడు. దీంతో కళ్యాణ్‌రామ్, రవికుమార్‌చౌదరిలతో సినిమా చేయడానికి దిల్‌రాజు అంగీకరించాడని టాక్..!