మొత్తానికి రామ్‌గోపాల్‌వర్మ మాటలు నిజమయ్యేలా ఉన్నాయి. చిరంజీవి 150 వ చిత్రానికి పూరీ దర్శకుడైతే బాగుంటుందని ఆ మద్య ఆయన ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోందని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. వర్మ అలా ట్వీట్ చేసినప్పుడు అందరూ దాన్ని వర్మ చేస్తోన్న ఓ పబ్లిసిటీ స్టంట్‌గా, తన ఇష్ట శిష్యుడైన పూరీని ఆకాశానికి ఎత్తే జిమ్మిక్కుగా అందరూ భావించారు. కానీ ఇప్పుడు మాత్రం చిరు 150 వచిత్రం దర్శకునిగా పూరీ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. కాగా చిరు కోసం పూరీ ఆల్‌రెడీ ‘ఆటోజానీ’ అనే టైటిల్‌ను కూడా రిజిష్టర్ చేయించాడు. ‘రౌడీ అల్లుడు’ చిత్రంలోని చిరు ఒక పాత్ర పేరు ఆటోజానీ అన్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ యూనివర్శల్‌గా ఉందని, ఎలాంటి స్టోరీకైనా ఈ టైటిల్ సూట్ అవుతుందని అందరూ పూరీని పొగుడుతున్నారు. కాగా చిరు కోసం రచయిత బి.వి.ఎస్.రవి తయారచేసిన కథకు ప్రస్తుతం పరుచూరి సోదరులు మెరుగులు దిద్దుతున్నారని, పూరీ ఇదే కథతో చిరు సినిమా చేస్తాడని ఇండస్ట్రీ టాక్.