తొలి తెలుగు హిస్టారికల్ 3డి చిత్రంగా తెరకెక్కిస్తున్న సినిమా 'రుద్రమదేవి'. గుణశేఖర్ సుమారుగా 75 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకునిగానే కాదు నిర్మాతగా కూడా గుణశేఖర్ కి చాలా ముఖ్యమైన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో అనుష్క మీద కన్నా, అల్లు అర్జున్ పైనే గుణశేఖర్ మొత్తం హోప్స్ పెట్టుకున్నాడట. అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ వల్ల గోనగన్నారెడ్డి పోస్టర్స్ విడుదలయినప్పటి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాకతీయుల కాలంనాటి బందిపోటు గోనగన్నారెడ్డి పాత్రలో ఆలు అర్జున్ కనిపించనున్నాడు. చాళుఖ్య వీరభద్రుడి పాత్రలో అనుష్క కి జంటగా రానా కనిపిస్తాడు. కృష్ణం రాజు, సుమన్, నిత్యమీనన్, క్యాథరిన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 28 న రిలీజ్ చేయనున్నారు.