దాదాపు 9ఏళ్లపాటు కష్టపడి రీసెర్చ్ చేసి తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో దాదాపు 75కోట్ల బడ్జెట్‌తో గుణశేఖర్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి’. హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రంలో కాకతీయుల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. కాగా ఈ చిత్రం తొలి టీజర్ ఈ నెల 28న విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియోను తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన వరంగల్‌లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుండే కాదు.. వివిధ రంగాలకు చెందిన తెలంగాణ కళాకారులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి టాక్స్ మినహాయింపు కోసం గుణశేఖర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశాడు. దీనికి కేసీఆర్ కూడా సముఖంగా ఉన్నాడని, అదే ఉద్దేశ్యంతో ఈ వేడుకకు కెసీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే యోచనలో గుణశేఖర్ ఉన్నట్లు సమాచారం.