ప్రముఖ కెమెరామెన్, దర్శకుడు విన్సెంట్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో చెన్నై లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. జెమినీ స్టూడియో లో స్టూడియో బోయ్ గా పనిచేసి స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు నటించిన 'మేజర్ చంద్రకాంత్' సినిమాకి మొదటి సారిగా సినిమాటోగ్రాఫర్ గా చేసి మంచిపేరు సంపాదించుకున్నారు. 'అన్నమయ్య' , 'అల్లరి ప్రియుడు' , 'సాహస వీరుడు సాగర కన్య' వంటి ఎన్నో హిట్ చిత్రాలకు పని చేసారు. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం లో చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. సుమారు 30 సినిమాలకు దర్శకునిగా పని చేసారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అజయన్ విన్సెంట్, జయనన్ విన్సెంట్ ఆయన కుమారులే.