Advertisementt

ఆదాశర్మకు ఉజ్వల భవిష్యత్తు...!

Wed 25th Feb 2015 03:21 AM
adahsharma,sruthihasan,son of sathyamurthy,subrahmanyam for sale  ఆదాశర్మకు ఉజ్వల భవిష్యత్తు...!
ఆదాశర్మకు ఉజ్వల భవిష్యత్తు...!
Advertisement
Ads by CJ

ఒక్క మెగాహీరో సరసన నటిస్తే ఇక మెగాక్యాంప్‌ హీరోలందరి చూపు అదే భామపై పడుతుంది. దీంతో వారి కెరీర్‌ ఊపందుకుంటుంది అనేది సినీ వర్గాల మాట. కాగా నిన్న శృతిహాసన్‌ తరహాలోనే ఇప్పుడు ‘హార్ట్‌ఎటాక్‌’ భామ ఆదాశర్మ కూడా మెగా హీరోల దృష్టిలో పడిందని ఇక ఆమెకు వరుస అవకాశాలు ఖాయం అంటున్నారు. ప్రస్తుతం అల్లుఅర్జున్‌ సరసన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో రెండో హీరోయిన్‌గా నటిస్తోన్న ఆదాశర్మ. తాజాగా మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా రూపొందుతున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రంలో అవకాశం సంపాదించింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా, ఓ హీరోయిన్‌గా రెజీనా నటిస్తున్న సంగతి తెలిసిందే. హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తుండటంతో చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఇంతమంది టాలెంట్‌ ఉన్న వారి చేతిలో పడిన ఆదాశర్మ త్వరలో సోలోహీరోయిన్‌ స్థాయికి ఎదగాలనే పట్టుదలతో ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ