వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన కొత్తలో జూపుడి ప్రభాకర్‌రావు మొత్తం తానై వ్యవహరించారు. పార్టీకి సంబంధించి ప్రతి విషయంలో అంబటి తర్వాత జూపుడి అత్యధికంగా మాట్లాడేవారు. అదే సమయంలో ఆయన చంద్రబాబు మీద కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇక హెరిటేజ్ పాలను కల్తీ చేస్తూ బాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని కూడా విమర్శించారు. అటు తర్వాత ఆయన ఓటమి పాలు కావడం, వైసీపీకి ఓటమి ఎదురవడంతో మెల్లిగా తన దృష్టిని టీడీపీవైపు మారల్చాడు. ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులతో సన్నిహితంగా మెలిగి జగన్‌ను తిట్టిపోయడం ప్రారంభించాడు. అటు తర్వాత ఇక తెలుగు దేశంలో చేరిపోయిన ఆయనకు చంద్రబాబు ప్రస్తుతం బాగానే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన్ను టీడీపీ అధికార ప్రతినిధిగా మార్చారు. తనను తిట్టిపోసిన జూపుడినే ఇప్పుడు బాబు అందలమెక్కిండం ఆశ్చర్యంగొలిపించే విషయమే. అంతేకాకుండా రాజకీయాల్లో నైతిక విలువలంటూ గంటలకొద్దీ క్లాసులు పీకే జూపుడి ఇలా పార్టీలు మారడం ఎంతవరకు సమంజసమో..?