ఎన్నికలకు ముందు జనసేన అంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్ ఆ తంతు ముగియగానే సినిమాలకే పరిమితమయ్యాడు. రాజకీయాలకు సంబంధించి రాస్ట్రంలో సంచలనాత్మక విషయాలు జరిగినా స్పందించడానికి పవన్ అంతగా ఆసక్తి చూపలేదు. ఇక ఇన్నాళ్లకు పవన్ మరోసారి రాజకీయాంశాల గురించి మాట్లాడారు. సోమవారం సాయంత్రం తన ట్విట్టర్ అకౌంట్లో పలు అంశాలపై ఆయన స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని, విభజన బిల్లులో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకంతోనే ఏపీలో బీజేపీ, టీడీపీ కూటమిని ప్రజలు గెలిపించారని, ఇప్పుడు వారిని మోసం చేయవద్దని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కొత్త రాజధాని నిర్మాణంలో వ్యవసాయ, వ్యవసాయాధారిత భూములు దెబ్బతినకుండా చూడాలని, లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఒకవేళ్ల కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పవన్ ఏం చేయనున్నారనేది కూడా స్పష్టం చేస్తే మరింత బాగుండేదేమో..!!