Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: మదాలశ శర్మ

Tue 24th Feb 2015 05:09 AM
madalasa sharma,interview,ramlela movie,promotional song  సినీజోష్ ఇంటర్వ్యూ: మదాలశ శర్మ
సినీజోష్ ఇంటర్వ్యూ: మదాలశ శర్మ
Advertisement
Ads by CJ

'ఫిట్టింగ్ మాస్టర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఇ.వి.వి, రామానాయుడు వంటి పెద్ద బ్యానర్స్ లో వర్క్ చేసి ప్రస్తుతం 'రామ్ లీల' సినిమాలో ప్రమోషనల్ సాంగ్ లో నటించి ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరోయిన్ మదాలశ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

- తెలుగు ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఎలా మొదలయ్యింది?

నేను పుట్టింది, పెరిగింది ముంబాయి లోనే. నా కెరీర్ తెలుగు ఇండస్ట్రీలోనే ప్రారంభం అయ్యింది. తెలుగులో నా మొదటి సినిమా ఇ.ఇ.వి గారి బ్యానర్ లో వచ్చిన 'ఫిట్టింగ్ మాస్టర్' . తరువాత రామానాయుడు గారి బ్యానర్ లో 'ఆలస్యం అమృతం విషం' అనే సినిమాలో నటించాను. అవి కాకుండా తెలుగులో 'మేం వయసుకు వచ్చాం', కన్నడలో 'శౌర్య'(తెలుగులో శౌర్యం), పంజాబిలో ఓ సినిమా, జర్మన్ లో ఓ సినిమాలో నటించాను. బాలీవుడ్ లో 'ఏంజెల్', 'సామ్రాట్ అండ్ కంపెనీ' అనే సినిమాలలో నటించాను. ఇంగ్లీష్ మూవీ లో కూడా నటించాను అది రిలీజ్ అయితే ఇంటర్నేషనల్ వైడ్ ఇమేజ్ వస్తుంది.

- 'రామ్ లీల' సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి?

ఈ సినిమాలో నేను ఎలాంటి పాత్రలో నటించలేదు. ఒక ప్రమోషనల్ సాంగ్ లో కనిపిస్తాను. 'భజన భజన' అనే ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. ఒకసారి ఈ పాట వింటే పదే పదే వినాలనిపిస్తుంది. 

- హీరోయిన్ గా నటించిన మీరు కేవలం ఒక పాటలో మాత్రమే కనిపించే రోల్ లో ఎందుకు నటించారు?

ఒక నటి గా ఎలాంటి పాత్రలు వచ్చిన నటించాలి. ఏ పాత్రలో నటిస్తే నాకు మంచి పేరు వస్తుందో అలాంటి పాత్రలలోనే నేను నటిస్తాను. ఒక పాత్రలో నటిస్తే అది మనకి మార్క్ ఇచ్చేలా ఉండాలి. ఈ సినిమాలో నేను చేసిన సాంగ్ అలాంటిదే అందుకే నేను నటించాను.

- ఇ.వి.వి, రామానాయుడు వంటి బిగ్ బ్యానర్స్ లో నటించిన మీరు తెలుగులో మళ్ళీ నటించడానికి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?

మీకు చెప్పినట్లు తెలుగులోనే కాకుండా చాలా సినిమాలలో నటించాను. కొన్ని సినిమాలకు సైన్ చేయడం వల్ల తెలుగులో నటించలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ తెలుగులో నటించడానికి సిద్ధంగా ఉన్నాను. 

- హిందీ 'రామ్ లీలా' సినిమాలో ప్రియాంకా చోప్రా ఐటెం సాంగ్ లో చేసింది ఇప్పుడు తెలుగు 'రామ్ లీలా' మీరు చేస్తున్నారు. ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా?

రెండింటిలో డాన్స్, కోరియోగ్రఫీ హైలైట్ గా ఉంటాయి. కోరియోగ్రఫీ విషయంలో ప్రియాంకా చేసిన సాంగ్ కన్నా 10 రెట్లు ఇదే బావుంటుంది.

- హీరో హవీష్ తో, డైరెక్టర్ కిరణ్ తో  వర్క్ చేయడం ఎలా అనిపించింది?

హవీష్ సెట్స్ మీద చాలా బిందాస్ గా ఉంటాడు. నేను సెట్స్ లో నటించడానికి ముందు ఎలాంటి హోమ్ వర్క్ చేయను. కానీ హవీష్ అలా కాదు చాలా హార్డ్ వర్కర్. సినిమా కోసం చాలా కష్టపడతాడు. డైరెక్టర్ సర్ అయితే కామ్ అండ్ పాజిటివ్ మనిషి. ఆయన చాన్స్ ఇస్తే మళ్ళీ వర్క్ చేయాలని ఉంది.

- బికినీ వేయడానికి సిద్ధమా?

తెలుగు ఇండస్ట్రీలో ఈ ప్రశ్న కామన్ అయిపోయింది. నా ప్రొఫెషన్ యాక్టింగ్. పాత్ర డిమాండ్ చేస్తే ఖచ్చితంగా బికినీ దరిస్తాను. ఓ స్టార్ హోటల్ లో చూస్తే పూల్ దగ్గర మామూలు జనాలు బికినీ లో కనిపిస్తారు. అలాంటిది ఓ యాక్టర్ గా నేనెందుకు వేయను.

- డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా?

నేను నటించిన బాలీవుడ్ సినిమా 'ఏంజెల్' లో నాది పక్షవాతంతో వీల్ చైర్ లో కూర్చునే పాత్ర. అదో చాలెంజింగ్ రోల్. రొటీన్ కి భిన్నంగా ఉండే అలాంటి పాత్రలలో నటించాలని ఉంది. ముఖ్యంగా హిందీలో వచ్చిన 'క్వీన్' లాంటి సినిమాలో నటించాలని ఉంది. 

- తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉంది?

ఒక్కరితో నటించాలని ఏం లేదు. తెలుగు లో నా ఫేవరెట్ హీరోస్ నాగార్జున, మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వాళ్ళల్లో ఎవరితో నటించమని ఛాన్స్ వచ్చినా నటిస్తాను.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ