Advertisementt

టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై..!!

Mon 23rd Feb 2015 07:57 AM
madhavaramkrishna rao,kukatpally mla,trs joining,aakarsh  టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై..!!
టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై..!!
Advertisement
Ads by CJ

తెలంగాణలో టీడీపీ పార్టీని పూర్తిగా ఖాళీ చేసేవరకు కేసీఆర్‌ విశ్రమించేలా కనబడటం లేదు. తన 'ఆకర్ష్‌' పథకంలో భాగంగా ఇప్పుడు మరో ఎమ్మెల్యేకు కేసీఆర్‌ గాలం వేస్తున్నాడు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ఎప్పటినుంచో టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. సెటిలర్స్‌ అధికంగా ఉన్న కూకట్‌పల్లి నుంచి గెలుపొందిన కృష్ణారావు టీఆర్‌ఎస్‌లో చేరితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బాగా కలిసివస్తుందని గులాబి దళం నాయకుడు భావిస్తున్నారు. గతంలోనే కృష్ణారావు టీఆర్‌ఎస్‌లో చేరడానికి అంతా సిద్ధమైనప్పటికీ చివరి నిమిషంలో ఇరుపక్షాలు మౌనం దాల్చాయి. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుండటంతో మరోసారి కేసీఆర్‌ కృష్ణారావుకు స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇక కృష్ణారావు డిమాండ్లను విన్న కేసీఆర్‌ అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. రేపోమాపో మరో ఎమ్మెల్యే కూడా టీడీపీకి దూరమవుతున్నట్లే కనబడుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ