టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విభజించు పాలించు సిద్ధాంతాన్ని బాగా ఒంటపట్టించుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో కేసీఆర్‌కు ఆయన అల్లుడు హరీష్‌రావునుంచి వెన్నుపోటు భయం ఉందని, అందుకే వలసలను ప్రోత్సహిస్తున్నాడని వారి మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించాడు. ఈ విషయమై హరీష్‌రావు సీరియస్ అయినా ఆయన పట్టించుకోకుండా అవే ఆరోపణలను కొనసాగించాడు. ఇక ఇప్పుడు ఉత్తర, దక్షిణ తెలంగాణల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. దక్షిణ తెలంగాణపై ఉత్తర తెలంగాణ ఆధిపత్యాన్ని సహించబోమని, దక్షిణ తెలంగాణ నాయకులు పెత్తనాన్ని అడ్డుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి దేవీప్రసాద్‌ను ఎంపిక చేయడంపై ఆయన ఇలా స్పందించారు. దక్షిణ తెలంగాణలో సమర్థుడైన నాయకుడు లేడని, ఉత్తర తెలంగాణనుంచి అభ్యర్థిని తీసుకొచ్చి నిలబెడుతున్నారా అని ప్రశ్నించారు. మరి ఈ ఉత్తర, తెలంగాణ అంశాలతో మరో ఉద్యమానికి రేవంత్ ఆజ్యం పోస్తున్నారా..? మరో కేసీఆర్ అవుదామనుకుంటున్నారా..?