నందమూరి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369'. అప్పటిలోనే ఇలాంటి సినిమాను తెరకెక్కించి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మంచి మార్కులు కొట్టేసాడు. బాలయ్యకు కూడా ఎంతగానో నచ్చే సినిమా ఇది. అయితే ఈ సినిమా వచ్చి హిట్ అయినప్పటి నుండి సీక్వెల్ ప్లాన్ చేసారు. సినిమా టైటిల్ గా 'ఆదిత్య 999' అని కూడా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. వి.ఎన్.ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం, స్క్రీన్ ప్లే వహించనున్నాడు. బడ్జెట్ విషయాల వలనే ఈ సినిమాకు బ్రేకులు పడుతున్నాయని ఫిలిం నగర్ టాక్. కానీ అదే కాన్సెప్ట్ తో తమిళంలో విజయ్ హీరోగా దర్శకుడు చింబు దేవన్ 'పులి' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సుదీప్, శ్రుతిహాసన్ లతో పాటు శ్రీదేవి కూడా ఓ లీడ్ రోల్ లో నటిస్తుంది.