Advertisementt

కన్‌ఫ్యూజన్‌లో మెగాభిమానులు...!

Mon 23rd Feb 2015 05:02 AM
megastar chiranjeevi,150th film,pawan kalyan,gabbar singh2  కన్‌ఫ్యూజన్‌లో మెగాభిమానులు...!
కన్‌ఫ్యూజన్‌లో మెగాభిమానులు...!
Advertisement
Ads by CJ

మెగాబ్రదర్స్‌ మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌లు మెగాభిమానులను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు. ఎప్పటినుండో వినిపిస్తున్న చిరంజీవి 150వ చిత్రంపై ఈమద్య చిరు నోరువిప్పడం లేదు. కేరళలకు చికిత్స కోసం వెళ్లాడని, ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తున్నాడనే వార్తలు తప్ప ఆయన మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. అలాగే ఎప్పుడో ప్రకటించిన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌2’ చిత్రం ఇంకా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకావడం లేదు. ఈ చిత్రం విషయంలో స్టోరీ ఫైనల్‌ అయిందని ఒకసారి, ఇంకా ప్రీపొడక్షన్‌వర్క్‌ జరుగుతోందంటూ ఒకసారి మీడియాలో వార్తలు వస్తున్నాయే గానీ పవన్‌ కూడా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మరి ఈ రెండు ప్రాజెక్ట్‌లు ఎప్పుడు మొదలవుతాయా? అని మెగాభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ