Advertisementt

1940ల నాటి కథలో మెగాహీరో..!

Mon 23rd Feb 2015 04:58 AM
mukunda,varun tej,krish,1940 story,usha kiran movies  1940ల నాటి కథలో మెగాహీరో..!
1940ల నాటి కథలో మెగాహీరో..!
Advertisement
Ads by CJ

‘ముకుంద’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ త్వరలో అభిరుచి గల దర్శకుడు క్రిష్‌తో కలిసి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.తన చిత్రాలకు ఎప్పుడూ ఏదో ఒక వైవిధ్యమైన కథను ఎంచుకునే క్రిష్‌ ఈ చిత్రానికి కూడా విభిన్నమైన ఇతివృత్తాన్ని ఎంచుకున్నాడని సమాచారం.ఈ చిత్రం స్వాతంత్య్రం రాకమునుపు అంటే 1940లలో జరిగే ఓ కథ అని తెలుస్తోంది. 1940ల నాటి ఓ రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. కాగా ఈ చిత్ర నిర్మాణంలో కూడా క్రిష్‌ భాగస్వామిగా ఉంటాడట. అన్నట్లు ఆయన తాజాగా తమిళ ‘శైవం’ చిత్రాన్ని ఉషాకిరణ్‌ మూవీస్‌ బేనర్‌తో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘దాగుడు మూతల దండాకోర్‌’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సీక్వెల్‌ తీసే ఉద్దేశ్యంలో కూడా క్రిష్‌ ఉన్నాడని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ