Advertisementt

ప్రభాస్‌ నిర్ణయంపై ఆసక్తి..!

Mon 23rd Feb 2015 01:36 AM
prabhas,bahubali,run raja run,sujith  ప్రభాస్‌ నిర్ణయంపై ఆసక్తి..!
ప్రభాస్‌ నిర్ణయంపై ఆసక్తి..!
Advertisement
Ads by CJ
‘మిర్చి’లాంటి ఘనవిజయం తర్వాత ప్రభాస్‌ గత రెండేళ్లుగా రాజమౌళి ‘బాహుబలి’కే అంకితం అయిపోయాడు. దీంతో ‘బాహుబలి’ తర్వాత ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు వరుస చిత్రాలు చేయాలని ఆయన భావిస్తుండం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌తో యు.వి.క్రియేషన్స్‌ బేనర్‌పై ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించినట్లు సమాచారం. అంతేగాక ప్రభాస్‌తో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ వంటి హిట్‌ చిత్రాన్ని తీసిన ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు దశరథ్‌ దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయడానికి ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. ఇటీవల దశరథ్‌ ఆయనకు స్టోరీ వినిపించినట్లు సమాచారం. అయితే దశరథ్‌`ప్రబాస్‌ల చిత్రం సుజీత్‌ సినిమా తర్వాతనే ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే దశరథ్‌ వెంకటేష్‌ హీరోగా ఓ చిత్రం చేయనున్నాడని, అంతలోపు ప్రభాస్‌ సుజీత్‌ సినిమా పూర్తి చేస్తాడని, ఆ తర్వాత దశరథ్‌ చిత్రం చేస్తాడని అంటున్నారు.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ