టాలెంట్ ఉన్న వారు ఎప్పటికైనా బ్యాగ్రౌండ్ లేకపోయినా పైకి వస్తారు... కష్టపడితే ఎవరైనా ఎత్తుకు ఎదుగుతారు.. వంటి మాటలు ఎవరు ఎన్ని చెప్పినా కూడా సినిమా పరిశ్రమలో నటవారసులదే హవా అని చెప్పాలి. ముద్దుగా అందరిచేత ‘బాబు’ అనిపించుకుంటూ తమ మొదటి చిత్రంలోనే సీనియర్‌స్టార్స్‌కు లభించే రాచమర్యాదలను అందుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయాలను బహిరంగంగా చెప్పడానికి ఎవ్వరికీ ధైర్యం ఉండదు. ఆ విషయంలో అక్కినేని అఖిల్ కాస్త వాస్తవాలు మాట్లాడాడనే చెప్పాలి. ఆయన మాట్లాడుతూ.. నాకు మొదటి చిత్రం షూటింగ్ మొదటి రోజు నుండే ‘రాకుమారుడు’ కి ఇచ్చిన మర్యాదలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా దర్శకుడు వినాయక్‌గారు నన్ను అపురూపంగా చూసుకొంటున్నాడు. ఆయన దర్శకత్వంలో నా మొదటి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది... అంటూ ట్వీట్ చేశాడు. మరి వారసత్వమా? మజాకా? అంటున్నారు టాలీవుడ్ వాసులు.