వయసు పైబడుతున్నప్పటికీ ఇప్పటికీ కుర్రహీరోయిన్లకు పోటీ ఇస్తూ.. ఆచితూచి అడుగులు వేస్తోంది సౌత్ ఇండియా బ్యూటీ నయనతార. రెమ్యూనరేషన్ ఎంతిచ్చినా కథ నచ్చకపోతే నో చెబుతోందిట. అన్నట్లు ‘గోపాల గోపాల’ చిత్రంలో కూడా శ్రియ పోషించిన పాత్రను నయనను అడిగితే... సినిమాలో నా పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేనప్పుడు నాతో పనేమిటి? అని దర్శకనిర్మాతలను మొహం మీదే అడిగేసిందని తెలుస్తోంది. కాగా ఆమె ఇటీవల ఓ తమిళ చిత్రానికి ఓకే చెప్పడంతో కోలీవుడ్ వర్గాలు నయన ఒప్పుకుందంటే సినిమాలో ఏదో విషయం ఉండే ఉంటుంది.. అంటున్నారు. ‘ఐ’ చిత్రం తర్వాత హీరో విక్రమ్ సమంత తో కలిసి విజయ్‌మిల్టన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. తాజాగా ఆయన ‘అరిమనంబి’ ఫేమ్ ఆనంద్ తో పనిచేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు విక్రమ్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించమని నయనతారను అడిగితే కథ మొత్తం విన్న ఆమె అందులో
నటించడానికి ఓకే చెప్పడంతో యూనిట్ చాలా ఆనందంలో ఉందిట.