Advertisementt

ఆ మాజీ మంత్రి టీడీపీలోకి..??

Sun 22nd Feb 2015 12:35 PM
mukesh goud joining tdp,thalasani srinivas yadav,ghmc elections  ఆ మాజీ మంత్రి టీడీపీలోకి..??
ఆ మాజీ మంత్రి టీడీపీలోకి..??
Advertisement
Ads by CJ

తెలంగాణ రాజధానిలో రాజకీయాలు రక్తికడుతున్నాయి. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఇక తలసాని టీఆర్‌ఎస్‌లో చేరడంతో హైదరాబాద్‌లో టీడీపీ కొంతమేర దెబ్బతింది. ఇప్పుడు ఆ లోటును మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ను పార్టీలో చేర్చుకొని భర్తీ చేయాలని చూస్తోంది. మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌కు సమీప బంధువైన ముఖేష్‌ టీడీపీలో చేరడానికి సముఖత వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తలసాని రాజీనామాను స్పీకర్‌ ఆమోదిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో తలసానిపై ముఖేష్‌గౌడ్‌ను రంగంలోకి దింపాలని కూడా ఆ పార్టీ యోచిస్తోంది. దీనికితోడు ముఖేష్‌ రాకతో హైదరాబాద్‌లో పార్టీ బలం పుంజుకుంటుందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా పైచేయి సాధించవ్చనే వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు ముఖేష్‌గౌడ్‌ రాకను కొందరు తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం వారిని బుజ్జగించే పనిలో టీడీపీ అధినాయకత్వం బిజీగా ఉంది. దీన్నిబట్టి చూస్తే త్వరలోనే ముఖేష్‌ ఇక టీడీపీ కండువా ప్పుకోవడం ఖాయమైనట్లుగా కనిపిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ