ప్రస్తుతం రాజకీయాల్లో పార్టీ సభ్యత్వాల నమోదు జోరుగా నడుస్తోంది. అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలంటూ గ్రామస్థాయినుంచి పార్టీల అధ్యక్షులకు టార్గెట్లు ఇస్తున్నారు. ఇక వేరే పార్టీలను కాదని తమ పార్టీలోనే అధిక సంఖ్యలో ప్రజలను చేర్చుకునేందుకు కొన్ని తాయిళాలు కూడా ఇస్తున్నారు. మొదటగా టీడీపీ తమ పార్టీలో చేరిన కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తామంటూ ప్రకటించింది. దీంతో మేల్కొన్న టీఆర్‌ఎస్ కూడా అదే పథకాన్ని ప్రవేశపెట్టి భారీ సంఖ్యలో ప్రజలను గులాబి దళంలోకి రప్పించింది. ఇక కాస్త లేటుగా మేల్కొన్న కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఇదే పంథాను అనుసరిస్తోంది. తమ పార్టీలో చేరితే రూ. 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నాల ప్రకటించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ రాజకీయ జోరును అడ్డుకొని కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలను చేరుకోవాలంటే ఈమాత్రం తాయిళం ఇచ్చుకోక తప్పదని ఆ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.