యూపీఏ హయాంలో రాబార్ట్ వాద్రా యువరాజుగా వెలుగొందారు. ప్రభుత్వానికి సంబంధించి ఆయనకు ఎలాంటి హోదా లేకున్నా.. ఎక్కడికి వెళ్లినా రాచమర్యాద లభించేది. తన పలుకుబడితోనే డీఎల్‌ఎఫ్‌తో కలిసి వందల కోట్లు సంపాదించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు అత్తకు అధికారం దూరం కావడంతో వాద్రా కూడా చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పలు కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. దీనికితోడు ఇన్నాళ్లు విమానాశ్రయాల్లో ఆయనకున్న వీవీఐపీ స్టేటస్‌కు కూడా గండిపడింది. ఈ స్టేటస్ ఉన్నవారికి విమానాశ్రయాల్లో చెకింగ్ ఉండదు. అయితే తాజాగా గోవా విమానాశ్రయంలో వాద్రా పేరును ఆ లిస్ట్‌నుంచి తొలగించారు. ఇక గోవాతో మొదలు మిగిలిన విమానాశ్రయాల్లో కూడా ఆయన పేరును వీవీఐపీ లిస్ట్‌నుంచి తొలగిస్తారనే వాదనలు వినబడుతున్నాయి. ఇక కేసుల రూపంలో కూడా వాద్రాకు చిక్కులు తప్పవని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.