రామ్ చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గా 'మై నేమ్ ఈజ్ రాజు' అనుకుంటున్నారు. ఈ సినిమా మార్చి5 నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్రలో నటించడానికి ముందుగా రమ్య కృష్ణ, జీవిత రాజశేఖర్, తులసి లను అనుకున్నా వారిని పక్కన పెట్టేసారు. నదియ ని తీసుకుందాం అనుకున్నా సినిమా బడ్జెట్ పెరిగిపోతుందని డ్రాప్ అయ్యారు. ప్రస్తుతం ఈ పవర్ ఫుల్ తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ 'శోభన'ను అనుకుంటునట్లుగా సమాచారం. అందంలోను, అభినయంలోను ఏ మాత్రం తీసిపోని శోభన అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చిత్ర బృందం అనుకుంటున్నారట. నిజంగానే శోభన ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది.