Advertisementt

బ్రహ్మి స్టార్ తగ్గిపోతుందా..?

Sun 22nd Feb 2015 05:09 AM
brahmanandam,poori,allu arjun,remuneration,temper movie  బ్రహ్మి స్టార్ తగ్గిపోతుందా..?
బ్రహ్మి స్టార్ తగ్గిపోతుందా..?
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా స్క్రీన్ మీద హీరో కనిపిస్తే క్లాప్స్ కొడతారో లేదో తెలియదు కాని కమెడియన్ బ్రహ్మానందం కనిపిస్తే మాత్రం ప్రేక్షకులకు పండుగే. సినిమాలు హిట్ అవడానికి ఆయనే కారణం అనడంలో అతిశయోక్తి లేదు. 2014లో సుమారుగా 19 సినిమాలలో నటించాడు. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమాలో కీలకపాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాంటి బ్రహ్మి 2015 లో ఒక సినిమాలో కూడా కనిపించలేదు. ప్రస్తుతం ఉన్న కమెడియన్స్ లో బ్రహ్మి చాలా కాస్ట్లీ. ఆయన రెమ్యునరేషన్ ప్యాకేజీలా కాకుండా రోజుల చొప్పున తీసుకుంటాడు. ఒక రోజుకి ఆయన 5 లక్షల వరకు చార్జ్ చేస్తాడు. అందుకేనేమో పూరి కి బ్రహ్మి అంటే ఎంత ఇష్టమున్నా 'టెంపర్' సినిమాలో ఆయనని తీసుకోలేదు. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా బ్రహ్మి నటిస్తున్నట్లు వార్తలు ఏమీ రావట్లేదు. అయితే మార్చి లో విడుదలవుతున్న నాగచైతన్య సినిమాలో మాత్రం బ్రహ్మి కనిపించనున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ