Advertisementt

బన్నీ కోసం మారుతోన్న బోయపాటి...!

Sun 22nd Feb 2015 03:35 AM
allu arjun,boyapati sreenu,venkatesh,balakrishna,race gurram  బన్నీ కోసం మారుతోన్న బోయపాటి...!
బన్నీ కోసం మారుతోన్న బోయపాటి...!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌ స్టార్ట్‌ చేసిన దశాబ్దకాలంలో బోయపాటి శ్రీను మేకింగ్‌ స్టైల్‌ ఎప్పుడూ మారలేదు. తన హీరోలు బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి సీనియర్స్‌ అయినా రవితేజ, జూనియర్‌ ఎన్టీఆర్‌లైనా కూడా ఆయన తన చిత్రాలను పక్కా మాస్‌ యాక్షన్‌ చిత్రాలుగా, హైఓల్టేజ్‌ యాక్షన్‌ చిత్రాలుగా, కత్తి పట్టడం, రక్తపాతం సృష్టిస్తూ సాగాయి. అయితే ఆయన సీనియర్స్‌లో ఇచ్చిన హిట్స్‌ను యంగ్‌స్టార్స్‌కు ఇవ్వలేకపోయాడు. ఇక తాజాగా అల్లుఅర్జున్‌తో ఆయన సినిమాచేయనున్నాడు. ఈ చిత్రం కోసం మెగాఫ్యామిలీ సలహాతో తనలోని మైనస్‌ పాయింట్లను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాడు. నేడు సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బన్నీ గత చిత్రాలైన ‘జులాయి, రేసుగుర్రం’ వంటివి సాధించిన విజయం వెనుక కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌దే ప్రదానపాత్ర. ఈ విషయంలో బోయపాటి చాలా వీక్‌. కామెడీని సరిగ్గా హ్యాండిల్‌ చేయలేడనే ఫీలింగ్‌ ఉంది. దాన్ని సరిదిద్దుకొని బన్నీ చిత్రంలో రొమాంటిక్‌, కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు బోయపాటి పెద్ద పీట వేయనున్నాడని సమాచారం. మరి బన్నీ కోసం ఇంతలా కష్టపడుతోన్న బోయపాటి తన ప్రయత్నంలో విజయం సాధిస్తాడో లేదో చూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ