ప్రస్తుతం హీరోయిన్ సమంత సినిమాకు రెండుకోట్లు డిమాండ్‌చేస్తోంది. మరీ ఇంత ఎక్కువా? అని అడిగిన మీడియా వారితో ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా హీరోల పెర్ఫార్మెన్స్ చూడటానికే వచ్చేవారు. కానీ ఇప్పటి రోజుల్లో హీరోయిన్లకు కూడా ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా యువతరం హీరోయిన్ల గ్లామర్ చూడటానికి థియేటర్లకు వస్తున్నారు. హీరోలతో సమానంగా మాకూ ప్రాదాన్యత ఇస్తున్నారు. అలాంటప్పుడు మేము ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంలో తప్పేముంది? అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఎంతైనా భలే గడసరి ఈ అమ్మడు అంటున్నాయి కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు.