Advertisementt

రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న మణి చిత్రం...!

Sat 21st Feb 2015 01:30 PM
legendary director maniratnam,ok kanmani,nithyamenon,mammutti  రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న మణి చిత్రం...!
రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న మణి చిత్రం...!
Advertisement
Ads by CJ

సాధారణంగా లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం సినిమా అంటే ఎప్పుడు  పూర్తవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఆయన తాజాగా నేటి యువదర్శకులకు పోటీగా తాను కూడా వేగంగా సినిమాలు తీయగలనని చాటిచెప్పారు. ఎంతో స్పీడ్‌గా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ఓకే కన్మణి’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నిత్యామీనన్‌, మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి తనయుడు తుల్కర్‌ సల్మాన్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి మణిరత్నంతో కలిసి సినిమాటోగ్రాఫర్‌ పి.సి.శ్రీరామ్‌ పనిచేస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తుండగా, తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌రాజు ‘ఓకే బంగారం’ పేరుతో  విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ఓ సుందరమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోందని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ