హీరోయిన్‌గా టాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న సమయంలో సమంత ఏమరుపాటుగా ఉంటే దాన్ని అవకాశంగా తీసుకొని శృతిహాసన్ చెలరేగిపోయింది. అయినా ఇప్పుడు ఈ ఇద్దరికీ తెలుగులో ఒకే ఒక్క సినిమా మాత్రమే చేతిలో ఉన్నాయి. సమంత అల్లుఅర్జున్ సరసన ‘సన్నాఫ్ కృష్ణమూర్తి’ చిత్రంలో నటిస్తుండగా శృతిహాసన్ మహేష్‌బాబు`కొరటాల శివ చిత్రంలో చేస్తోంది. అయితే తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందనున్న నాగ్`కార్తిల చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇక తమిళంలో మాత్రం వీరిద్దరి మధ్య పోటీ నువ్వా? నేనా? అనే రేంజ్‌లో ఉంది. మిగతా హీరోయిన్స్ వీరిద్దరి దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. ‘కత్తి’ హిట్ తర్వాత సమంత ప్రస్తుతం విక్రమ్, సూర్యలతోనే కాకుండా త్వరలో ప్రారంభంకానున్న విజయ్ తాజా చిత్రంలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొంది. ఇక శృతిహాసన్ కూడా ప్రస్తుతం విజయ్ హీరోగా రూపొందుతోన్న ‘పులి’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో హన్సిక కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా అజిత్, శివల కాంబినేషన్‌లో రూపొందనున్న మూవీలో మొదట సమంతను అనుకొని చివరి క్షణంలో శృతిహాసన్‌ను తీసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్యాపోటీ నువ్వా? నేనా? అన్నట్లుగా సాగుతుండటం కోలీవుడ్ వర్గాలకు ఎవరు నెంబర్‌వన్? అనే విషయంపై చర్చకు ఆస్కారమిస్తోంది.