‘టెంపర్’ చిత్రం సాధించిన భారీ విజయంతో ఫుల్ ఖుషీగా ఉన్న దయ మరలా బాక్సాఫీస్ దండయాత్రకు బయలుదేరనున్నాడు. ఈసారి ఆయన సుకుమార్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌లతో కలిసి యుద్దానికి సిద్దమవుతున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటించనున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రం ఫాదర్ సెంటిమెంట్ రివేంజ్ డ్రామాగా వైవిధ్యంగా తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రంలో జగపతిబాబు కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. మరి అది విలన్ పాత్రా? లేక ఎన్టీఆర్ తండ్రి పాత్రా అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. ఈ చిత్రాన్ని మార్చి 3వ తేదీన గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. అయితే ఈ చిత్రం దసరాకు వస్తుందని భావించిన నందమూరి అభిమానులకు మాత్రం ఈ వార్త నిరాశపరుస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 8వ తేదీ 2016లో అంటే వచ్చే సంక్రాంతికి రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. కిందటి ఏడాది సంక్రాంతికి వచ్చిన సుకుమార్`మహేష్‌ల ‘1’ (నేనొక్కడినే) చిత్రం ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ సారి ఆ సెంటిమెంట్‌కు బ్రేక్ ఇవ్వాలని సుకుమార్ డిసైడ్ అయ్యాడట.