పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘పులి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భారత సంతతికి చెందిన బ్రిటిష్ బ్యూటీ నికిషాపటేల్. పవన సరసన అవకాశం రావడంతో స్టార్‌హీరోయిన్‌ను కావడం ఖాయం అనుకొంది. అయితే ఆమె కలలన్నీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో నీరుగారిపోయాయి. అవకాశాలు కరువవ్వడంతో చూడగా.. చూడగా ఆ తర్వాత రెండేళ్లకు కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. అయినా పెద్దగా పేరు రాలేదు. ఆమధ్య తెలుగు చిత్రమైన కళ్యాణ్‌రామ్ ‘ఓం 3డి’ చిత్రంలో అవకాశం వచ్చినా అది కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం తమిళ, కన్నడ చిత్రాలపై దృష్టిపెట్టిన ఆమె తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆమె అందం ఐటంసాంగ్స్‌కు పనికొచ్చే విధంగా ఉండటంతో కొందరు నిర్మాత దర్శకులు ఆమెను తమ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేయమంటున్నారు. కానీ అలాంటి అవకాశాలకు ఆమె నో చెబుతోంది. తాజాగా నాగచైతన్య, సుదీర్‌వర్మ కాంబినేషన్‌లో బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘దోచెయ్’ చిత్రంలో ఆమెను ఓ ఐటంసాంగ్ చేయమంటే నో చెప్పిందట. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ... నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేనే వాటిని వద్దనుకుంటున్నాను. నాగచైతన్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేయమని కోరారు. కానీ అలాంటి స్పెషల్ సాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎప్పటికైనా చేయాల్సివస్తే... వన్ అండ్ ఓన్లీ పవన్‌కళ్యాణ్ చిత్రమైతేనే చేస్తాను. ఇతర హీరోలతో చేయను.. అంటూ నిక్కచ్చిగా చెప్పుకొచ్చింది...!