పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఇక తాజాగా మీడియాతో ఆమె మాట్లాడిన మాటలు స్కూల్ విద్యార్థులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. స్వైన్‌ఫ్లూ వ్యాధి గురించి వైద్య శాస్త్రవేత్తలకు కూడా తెలియని కొత్త విషయాన్ని మమతా బెనర్జీ కనిపెట్టారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప.బెంగాల్‌లో స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందని, దోమ కాటు వల్లే ఈ రోగం వస్తుందని కొత్త భాష్యం చెప్పారు. అంతేకాకుండా దోమలు వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. నిజానికి స్వైన్‌ఫ్లూ అనేది పందుల నుంచి మనిషికి.. ఆ తర్వాత రోగి నుంచి మరో రోగికి వ్యాప్తి చెందుతుంది. కనీసం ఇంతమటుకు అవగాహన లేకుండానే మమతా మీడియాతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మరీ మాట్లాడటం అటు అధికారవర్గాన్ని ఇటు ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. మరి ఫైర్‌బ్రాండ్ ఏంచేసినా కొత్తగానే ఉంటుంది కదూ..!