Advertisementt

జానారెడ్డి గులాబి కండువా కప్పుకుంటారా..??

Fri 20th Feb 2015 06:40 AM
jana reddy,opposition leader,sonia gandhi,clp leader  జానారెడ్డి గులాబి కండువా కప్పుకుంటారా..??
జానారెడ్డి గులాబి కండువా కప్పుకుంటారా..??
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో జానారెడ్డి అత్యంత సీనియర్‌ చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కరలేదు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సంయమనం పాటిస్తూ  ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేలా సోనియాను ఆయన ఒప్పించారన్న వాదనలు కూడా వినబడ్డాయి. ఇక ప్రతిసారి తెలంగాణ నుంచి సీఎం రేసులో జానారెడ్డి ఉన్నప్పటికీ అది ఆయనకు అందని  ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక తాజాగా ఆయన్ను విపక్షనేత హోదానుంచి కూడా తొలగించాలని హైకమాండ్‌ భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా టీఆర్‌ఎస్‌ను విమర్శించకపోవడం, మెతక వైఖరిని అవలంబిస్తుండటంపై అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు  వార్తకథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రతిపక్ష నేత పదవినుంచి తొలగించాలని సోనియా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్‌ దూకుడు ముందు జానారెడ్డి ఆచితూచి మాట్లాడటం ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపుతోందని, ప్రజాసమస్యలపై అధికారపక్షాన్ని నిలదీయకపోవడం ప్రజల దృష్టిలో కాంగ్రెస్‌ను మరింత దిగజారుస్తోందని ఆ పార్టీ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. మరి కాంగ్రెస్‌ అధిష్టానం అనుకున్న విధంగా చేస్తే జానారెడ్డి కూడా గులాబి కండువా కప్పుకుంటారో ఏమో..?.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ